బీజేపీ సర్కారు రైతు వ్యతిరేకి: మంత్రి హరీశ్ రావు
మంత్రి హరీశ్ రావు | కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లను కొనడంలేదని, వ్యవసాయ మార్కెట్లను ఎత్తివేసి, డీజిల్ ధరలు పెంచుతూ రైతుల

సిద్దిపేట: కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లను కొనడంలేదని, వ్యవసాయ మార్కెట్లను ఎత్తివేసి, డీజిల్ ధరలు పెంచుతూ రైతుల నడ్డి విరుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో రైతులపై భారం పడిందన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతు ఉసురు పోసుకుంటున్నదని విమర్శించారు. సిద్దిపేట జిల్లాలోని అంకంపేటలో కొత్తగా నిర్మించిన 43 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు చేయించారు. కొత్తగా 21 ఇండ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. చింతమడక-అంకంపేట గ్రామం ఐక్యతకు నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో అంకంపేట, సీతారాంపల్లిలోని శంకర్నగర్, ఎస్సీ కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.

మెదక్ జిల్లాలో పాదయాత్రలు చేస్తున్న నేతలు.. రైతులు, ప్రజలపై ప్రేమ ఉంటే పెంచిన సిలిండర్ల ధర తగ్గించేందుకు కృషిచేయాలని, దానికోసం పాదయాత్రలు చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడనైనా ఉన్నాయో చూపెట్టాలన్నారు. దేశంలో రైతులకు రూ.5 లక్షల బీమా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని, దొడ్డు వడ్లు కొనకుండా మొండికేస్తున్నదని విమర్శించారు.
రైతుబంధుతో సీఎం కేసీఆర్ రైతులను ఆదుకుంటుంటే.. డీజిల్ పేరుతో బీజేపీ దోచుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతల పాదయాత్ర దేని కోసమని.. డీజిల్, గ్యాస్ ధరలు పెంచినందుకా, మార్కెట్లు ఎత్తి వేస్తున్నందుకా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం నీళ్లతో, పచ్చని పంట పొలాలతో కళకళలాడుతుందని, ఇది తెలంగాణ ప్రభుత్వ విజయం కాదా అని చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

