న్యూఢిల్లీ, మార్చి 31: అబద్ధపు ప్రచారాలతో ఇంతకాలం అందర్నీ మభ్యపెట్టిన కమలదళం అసత్యాల కోట బద్దలవుతున్నది. దేశంలోనే అతి పెద్ద పార్టీగా చెప్పుకొనే బీజేపీ గ్రాఫ్ క్షేత్రస్థాయిలో అంతకంతకు దిగజారిపోతున్నది. లోక్‌సభ ఎన్నికల్లో మిత్రపక్షాల సాయంతో మూడోసారి గద్దెనెక్కిన ప్రధాని నరేంద్రమోదీ పాపులారిటీ కూడా అదే రీతిలో రోజురోజుకు పడిపోతున్నది. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో మోదీ ఘోరంగా విఫలమయ్యారు. ఈ మేరకు ఎలాన్ మస్క్‌కు చెందిన ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ కుండబద్దలు కొట్టింది. అయితే, ప్రస్తుత వాస్తవ పరిస్థితులు, ‘గ్రోక్’ బయటపెడుతున్న నిజాలు ప్రధాని మోదీ సహా బీజేపీ నాయకులందరికీ మింగుడుపడటం లేదు. కాగా ‘గ్రోక్’ ఇచ్చిన సమాధానాలు వాస్తవాలేనని, దాంట్లో తప్పుబట్టడానికి ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోదీ, బీజేపీకి సంబంధించి నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ‘గ్రోక్’ సూటిగా సమాధానాలు ఇచ్చిందని చెప్తున్నారు.
‘2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభావం తగ్గిపోయిందా?’ అని ఇటీవల ఓ నెటిజన్ ‘గ్రోక్’ను ప్రశ్నించాడు. దీనికి ఏఐ చాట్‌బాట్ స్పందిస్తూ… ‘2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ బలహీనపడింది. గతంతో పోలిస్తే ఆ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 63 సీట్లను కోల్పోయి 240 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. పార్టీపరంగా విభజన రాజకీయాలు చేస్తుండటంతో బీజేపీపై ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతున్నది’ అని సమాధానమిచ్చిన గ్రోక్.. మొత్తంగా క్షేత్రస్థాయిలో బీజేపీ గ్రాఫ్ పడిపోతున్నదని సంకేతాలిచ్చింది. ఇక, బీజేపీతో పాటు ప్రధాని మోదీ పాపులారిటీ కూడా క్రమంగా తగ్గిపోతున్నదని గ్రోక్ చెప్పింది. మిత్రపక్షాల సహకారంతో అధికారంలోకి వచ్చి ప్రధాని పీఠాన్ని మోదీ అధిరోహించినప్పటికీ, గతంతో పోలిస్తే మోదీ క్రేజ్ అంతకంతకు పడిపోతున్నట్టు గ్రోక్ తేల్చిచెప్పింది.
మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ఎన్నో హామీలు కురిపించారు. కానీ, ఆ హామీలను నిలబెట్టుకోవడంలో మాత్రం చేతులెత్తేశారు. ఇదే విషయమై ఓ నెటిజన్ ‘గ్రోక్’ను ప్రశ్నించాడు. బీజేపీ ప్రభుత్వంలో విధానపరమైన వైఫల్యాల గురించి కూడా వివరించాలని గ్రోక్‌ను కోరాడు. దీనికి చాట్‌బాట్.. ఎన్నికల హామీలను మోదీ నిలబెట్టుకోలేదని స్పష్టం చేసింది.
వాతావరణ మార్పులపై చర్యలు