కొత్తకోట, ఏప్రిల్ 13 : ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. శనివారం వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన అడ్డాకుల, మదనాపురం, కొత్తకోట మండలాల బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఆరు పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలతో జనాన్ని మభ్యపెడుతున్నదని ధ్వజమెత్తారు. గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్కు ఓటు అడిగే నైతిక హక్కులేదని అన్నారు. ఫ్రీ బస్సులో మహిళలు సిగలు పట్టుకుంటున్నారని, పథకం అమలు చేసినప్పుడు బస్సులను పెంచాలన్న ఆలోచన లేకపోవడం దుర్మార్గమని అన్నారు. రావణాసురుడి వంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఉండకూడదని ఆమె తెలిపారు. తనపై కుట్ర జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.