హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): గుంపుమేస్త్రీనని చెప్పుకొనే సీఎం రేవంత్‌రెడ్డికి ఏడు నెలలైనా పాలనపై పట్టు రాలేదని, ఇంకా తడబడుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే రైతు భరోసా వేస్తామని చె ప్పి, ఏడు నెలల తర్వాత ఇప్పుడు క్యాబినెట్ సబ్‌కమిటీ ఎందుకు వేశారని ప్రశ్నించారు. డిసెంబర్ 9న రైతు భరోసా ఏ ఒకరికి అందకున్నా ముకు నేలకు రా స్తా అని కొత్తగూడెం సభలో అన్నారని, ఇ ప్పుడు ఎకడ రాస్తారో చెప్పాలన్నారు. దున్నే ప్రతి రైతుకు, పండే ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వడ్డీ లేని రుణం, 63 లక్షల మంది మహిళలకు 5 లక్షల బీమా అంటూ హామీలిచ్చి మోసం చేశారని దుయ్యబట్టారు.
154 మంది వీఆర్ఏల అలాట్మెంట్
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : సాంకేతిక కారణాలతో ఇప్పటికీ వీఆర్ఏలుగా కొనసాగుతున్న 154 మందికి ప్రభుత్వం ఊరట కల్పించింది. విద్యార్హతల ఆధారంగా వారిని జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్‌గా నియమిస్తూ సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. గతంలో వీరిని వివిధ విభాగాల్లోకి తీసుకున్నా, విద్యార్హతలకు సంబంధించిన సమస్యలతో అలాట్మెంట్ ప్రక్రియ పూర్తి కాలేదు.