Etala Rajender | మేడ్చల్ మల్కాజ్గిరి : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని పూజిత అపార్ట్మెంట్ నివాసులకు హైడ్రా నోటీసులు జారీ చేయడంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజిత అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్న ఈటల రాజేందర్ బాధితులకు భరోసా కల్పించారు. అపార్ట్మెంట్ను కూల్చివేస్తామని నోటీసులు ఇవ్వడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు.. ఇది తుగ్లక్ ప్రభుత్వం. మా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడితే.. ఖబడ్దార్ నా కొడకా అని రేవంత్ రెడ్డిని ఈటల రాజేందర్ హెచ్చరించారు. రేవంత్ శాడిస్ట్, సైకో కాబట్టే ప్రజల్ని ఏడిపిస్తున్నాడు. నువ్వు సైకో కాబట్టే ఎవరు చెప్పినా వినడం లేదు. ముఖ్యమంత్రి అనే వాడు ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. ఇలాంటి పిచ్చి వేషాలు మానుకో రేవంత్ రెడ్డి.
ఈ కాంగ్రెస్ సర్కార్ ఓ తుగ్లక్ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి ఓ తుగ్లక్. ఈ ప్రభుత్వానికి తలా తోక లేదు.. ఇది ఎన్నో రోజుల పాటు ఉండదు అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
కాగా, గతంలో కూడా ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘రేవంత్ రెడ్డి ఒక జోకర్.. ఆయనకు పరిపాలన చేతకాదు’ అని ఆయన తీవ్ర విమర్శలు చేసారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనుభవం లేదని.. వారు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళుతోందని విమర్శించారు.
మా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడితే.. ఖబడ్దార్ నా కొడకా
రేవంత్ శాడిస్ట్, సైకో కాబట్టే ప్రజల్ని ఏడిపిస్తున్నాడు
నువ్వు సైకో కాబట్టే ఎవరు చెప్పినా వినడం లేదు
ముఖ్యమంత్రి అనే వాడు ప్రజల కష్టాలు తెలుసు కోవాలి
ఇలాంటి పిచ్చి వేషాలు మానుకో రేవంత్ రెడ్డి
ఈ కాంగ్రెస్ సర్కార్ ఓ… pic.twitter.com/7WvCAa0N9k
— Telugu Scribe (@TeluguScribe) May 11, 2025