హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): నేషనల్ హెరాల్డ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాత్ర ఏమిటో ఆయనే సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్రెడ్డి పేరును కూడా ఈడీ చేర్చినప్పటికీ ఆయన స్పందించకపోవడం వెనుక అనుమానాలున్నాయని పేర్కొన్నారు.
ఈ కేసులో డబ్బులు ఇచ్చినట్టు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒప్పుకున్నారని చెప్పారు. సీఎం రేవంత్ సైతం ఎంతమంది నుంచి డొనేషన్లు వసూలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి ఇప్పటికే ఓటుకు నోటు కేసులో ఉన్నారని ఎద్దేవా చేశారు.