హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు. మంగళవారం బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డిని అరెస్టు చేశారు.
హైదరాబాద్, మార్చి 18 (నమస్తేతెలంగాణ): విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, దేవాదాయ, ధర్మాదాయ, వైటీడీఏ బోర్డు బిల్లులు శాసనమండలిలో మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. అనంతరం సభ బుధవారానికి వాయిదా పడింది.