ఈ విషయం బండి సంజయ్‌కి చెప్పా
ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, ఏప్రిల్ 4 : ‘మా బీజేపీలో ఒక ఫాల్తూగాడు ఉన్నడు’ అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటివారి వల్లే పార్టీకి చెడ్డపేరు వస్తున్నదని, అతడి గురించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. కాంగ్రెస్‌లోనూ ఇలాంటివాళ్లు ఉన్నారంటూ మరోరాయి విసిరారు. మరోవైపు డ్రగ్స్ అమ్మేవారిని ఎన్కౌంటర్ చేయాలని ఉచిత సలహా ఇచ్చారు. రాజాసింగ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి. బీజేపీకి చెడ్డపేరు తెస్తున్న వ్యక్తి గురించి బండి సంజయ్‌కి చెప్పానని రాజాసింగ్ అన్నారు. అయితే.. ఇటీవల ఆ పార్టీ ఎవరిమీదా క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. దీనిని బట్టి రాజాసింగ్ చెప్పినా, బండి పట్టించుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.