Payal Shankar | ఆదిలాబాద్ : భారతీయ జనా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో పాటు ఆయన అనుచరులు ఓ పోలింగ్ కేంద్రంలోకి కాషాయ కండువాలు ధరించి ప్రవేశించారు. దీంతో ఓటేసేందుకు వచ్చిన కొంత మంది మహిళలు వారిని అడ్డుకున్నారు. కాషాయ కండువా ధరించి ఎందుకు వచ్చారని మహిళా ఓటర్లు ప్రశ్నించారు. దీంతో మీరు బొట్టు కూడా పెట్టుకోవద్దు.. ఎందుకు పెట్టుకున్నారని మహిళా ఓటర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా దౌర్జన్యానికి పాల్పడ్డారు. వారిని బయటకు పంపండి అంటూ పోలీసులను ఎమ్మెల్యే ఆదేశించారు. కాషాయ కండువా కప్పుకున్న వారిని బయటకు పంపిస్తేనే తాము బయటకు వెళ్తామని మహిళలు పోలీసులకు తెగేసి చెప్పారు.
పోలింగ్ బూత్ ల వద్ద బీజేపీ ఎమ్మెల్యే పాయల్ దౌర్జన్యం..
కాషాయ కండువాలు ధరించి పోలింగ్ బూత్ లలో తిరుగుతున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
ప్రశ్నిస్తున్న ఆడవారిపై దాడులకు దిగుతున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అనుచరులు.. pic.twitter.com/0vLIgfRdbi
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024