జహీరాబాద్, డిసెంబర్ 5 : పదవులు పొందేందుకు అధికారంలో ఉన్న పార్టీ ఎంతకైనా తెగిస్తుంది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను నామినేషన్ వేయకుండా భయపెట్టించడం.. బెదిరింపులకు దిగడం.. అవసరమైతే అభ్యర్థులతో పాటు నాయకులపై నాయకులపై దాడులకు పాల్పడుతూకిడ్నాప్లు చేయడం చేస్తుంటారు. కానీ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం అత్తునూర్ గ్రామంలో సీన్ రివర్స్ అయింది. మూడో విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామ సర్పంచ్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. అలాగే 8 వార్డు రిజర్వేషన్లను అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గ్రామ సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్ వేసేందుకు గురువారం సిద్ధమయ్యారు.
అంతలోనే గ్రామ బిజెపి నాయకులు అధికార పార్టీకి చెందిన వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా అడ్డుకొని బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా నామినేషన్లు వేయకుండా తమ కార్లలో తీసుకెళ్లారు. ఎందుకు నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని అధికార పార్టీకి చెందిన నాయకులు బిజెపి నాయకులను ప్రశ్నిస్తే దాడులకు సైతం దిగారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు బిజెపి పార్టీ నాయకులకు మద్దతు పలకడంతోనే వార్డు సభ్యుల నామినేషన్ వేయకుండా దౌర్జన్యాలకు దిగుతున్నారని అధికార పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు.
ఇది జరుగుతుందని ముందే గ్రహించి బుధవారం రోజే అధికార పార్టీకి చెందిన నాయకులు సర్పంచ్, ఒక వార్డు సభ్యు స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం మిగిలిన వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ వేసేందుకు అభ్యర్థులను తీసుకొని నాయకులు వెళ్తుండగా గ్రామానికి చెందిన బిజెపి నాయకులు అడ్డుకున్నారు. ఇదేమిటి అని ప్రశ్నించిన నాయకులపై దౌర్జన్యాలకు దిగారు. అభ్యర్థుల నామినేషన్ వేయకుండా కార్లలో తీసుకెళ్లారు.
జరుగుతున్న అన్యాయం గురించి మండల అధికార పార్టీ నాయకుల దృష్టికి గ్రామ నాయకులు తీసుకెళ్లారు. గురువారం రాత్రి న్యాల్కల్ మండలం హాద్నూర్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని బిజెపి నాయకుల పై ఫిర్యాదు చేశారు. సర్పంచ్ ఎన్నికలల్లో పోటీలో చేసేందుకు అభ్యర్థులకు రక్షణ కల్పించాలని పోలీసులకు కోరారు. శుక్రవారం ఎవరు అడ్డు తగలకపోవడంతో ప్రశాంతంగా అధికార పార్టీ చెందిన అభ్యర్థులు వార్డు స్థానాలకు నామినేషన్ దాఖలు చేశారు