షాద్‌నగర్, నవంబర్ 16: లగచర్ల ఘటన అనంతరం బాధితుల పరామర్శకు వెళ్తున్న మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణను పోలీసులు అడ్డుకున్నా ఆ పార్టీ నేతలు స్పందించకపోవడం దేనికి నిదర్శనమని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబాల్‌నాయక్ ప్రశ్నించారు. గిరిజనులు, దళితులు, బహుజనులకు బీజేపీ వ్యతిరేకమనే విషయం దీంతో మరోమారు బయటపడిందని ఆరోపించారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ అరుణను అక్కడి పోలీసులు అడ్డుకుంటే కేంద్ర మంత్రులైన కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు ఖండిచలేదని అన్నారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే అనే విషయం తేటతెల్లమైందని చెప్పారు. పేద రైతుల భూములను ఫార్మా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి ఎలాంటి ప్రొటోకాల్ లేకున్నా అక్కడి అధికారులు రాచమర్యాదలు చేయడమేమిటని ప్రశ్నించారు. ఈ నెల 20న లగచర్ల సహా సమీప తండాల్లో ఎల్‌హెచ్‌పీఎస్ జాతీయ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, రాష్ట్ర శాఖ బృందం పర్యటిస్తుందని తెలిపారు.