ఆదివారం 12 జూలై 2020
Telangana - May 28, 2020 , 21:05:15

ప్రభుత్వం చెప్పిన పంటలే సాగు..బీర్‌పూర్‌ రైతుల ప్రతిజ్ఞ

ప్రభుత్వం చెప్పిన పంటలే సాగు..బీర్‌పూర్‌ రైతుల ప్రతిజ్ఞ

జగిత్యాల జిల్లా : తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచేలా నియంత్రిత సాగు విధానాన్ని అనుసరించాలని సీఎం కేసీఆర్ సూచించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ప్రభుత్వం చెప్పిన పంటలే సాగు చేస్తామని జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలకేంద్రంలో రైతులు ప్రతిజ్ఞ చేశారు. నియంత్రిత పంటల సాగుపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బీర్‌పూర్‌ లో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతును రాజుగా చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పమన్నారు. తెలంగాణ రైతాంగం ఈ వానకాలం నియంత్రిత పద్ధతిలో పంటలు సాగుచేసి మార్కెట్‌లో మంచిలాభాలు పొందాలని ముఖ్యమంత్రి ఆలోచన అని పేర్కొన్నారు. అధికారులు సూచించిన పంటలను సాగు చేసి మంచి లాభాలు పొందాలని సూచించగా.. రైతులు ప్రభుత్వం చెప్పిన పంటలే సాగు చేస్తామని ప్రతిజ్ఞ చేసి తీర్మానం చేశారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo