Bhubharati Bill | హైదరాబాద్ : శాసనసభలో భూభారతి బిల్లును రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భూభారతి బిల్లుకు సంబంధించిన ముఖ్యాంశాలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభకు వివరించారు.
ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి స్థానంలో భూభారతిని తీసుకొస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు లిఖితపూర్వకంగా సూచించిన అంశాలను పొందుపరిచాం. ముసాయిదా బిల్లును 40 రోజులు వెబ్సైట్లో ఉంచాం. ఎమ్మెల్యేలు, మేధావులు ఇచ్చిన అంశాలను డ్రాఫ్ట్‌లో పెట్టాం. రాష్ట్రంలోని 33 కలెక్టరేట్లలో ఒక రోజు చర్చ కూడా నిర్వహించాం. 18 రాష్ట్రాల్లో ఆర్ఓఆర్ చట్టాలను పరిశీలించి భూభారతి తీసుకొచ్చాం. ప్రతి గ్రామానికి ఓ రెవెన్యూ అధికారిని నియమిస్తాం. భూ వివాదాలపై అప్పీల్‌కు ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తాం. అనుభవదారుల కాలాన్ని కూడా ఈ కొత్త బిల్లులో పొందుపరిచాం. 33 మాడ్యూల్స్‌తో ఉన్నదాన్ని 6 మాడ్యూల్స్‌తో పునఃప్రక్షాళన చేస్తున్నాం అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Tiger | పట్టపగలే.. రైలు పట్టాలు దాటుతూ కెమెరాకు చిక్కిన పెద్ద పులి.. వీడియో
KTR | తిన్నాక పాన్ వేసుకున్నారా..? రూ. 32 వేల ప్లేట్ భోజనం అంటే అరగాలి కదా..? : కేటీఆర్
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డిని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుంది : హరీశ్‌రావు