హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏసీబీ చరిత్రలో భారీ అవినీతి అనకొండగా చరిత్రకెక్కిన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి అరెస్టు కాకుండా పెద్ద లాబీయింగ్ జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. తనకున్న రాజకీయ పలుకుబడితో ఏకంగా ముఖ్యనేత సతీమణి వద్దకే ఓ వ్యాపారవేత్తతో రాయబారం పంపినట్టు తెలిసింది. మొదట కొంత సంశయించినా.. ఆ తర్వాత భీంరెడ్డిని అరెస్టు నుంచి తప్పించేందుకు ‘గ్రీన్‌సిగ్నల్’ వచ్చినట్టు తెలిసింది. నేరుగా పెద్ద మేడమ్.. లైన్లోకి రా వడంతో 41 సీఆర్పీసీ నోటీసుతోనే ఆగిపోయినట్టు సమాచారం. భీంరెడ్డికి ఉన్న రక్తపోటు(బీపీ)ని అ దునుగా మార్చి.. అనారోగ్యం వంక చూపి అరెస్టు నుంచి తప్పించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. గ తంలో కొందరు అధికారులకు గుండెపోటు వచ్చి నా వెనుకడుగు వేయని చరిత్ర ఏసీబీకి ఉంది. కానీ భీంరెడ్డి వ్యవహారంలో అటు పెద్ద మేడమ్‌కు ఇటు ఏసీబీ అధికారికి మధ్య రాయబారం నడిపారని వి నికిడి. ఈ క్రమంలో కొన్ని రూ.కోట్లు చేతులు మారినట్టు ఏసీబీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.
మునుపెన్నడూ లేనివిధంగా ఓ అవినీతిపరుడికి ఏసీబీపై వత్తాసు పలుకడంతో తీవ్ర విమర్శలు వ చ్చాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులకు ఒక విధంగా.. ఉన్న త కులాల అధికారులతో మరోలా ప్రవర్తిస్తున్నారని తీవ్ర చర్చ మొదలైంది. ఈ పక్షపాత వైఖరిపై సోషల్ మీడియాలో పోస్టుల వరద పారింది. దీనికితోడు కేసు దర్యాప్తులో ఏసీబీ పక్షపాతంగా వ్యవహరించిందని, చట్టాన్ని అందరికీ సమానంగా వ ర్తింపజేయలేదని ఆరోపిస్తూ.. ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారుసిన్హాకు టీజీఎస్పీడీసీఎల్ ఇబ్రహీంబాగ్ మాజీ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ ఈ అంబేద ర్ భార్య డీఆర్ తబిత ఫిర్యాదు చేశారు. ‘చట్టం ముందు అందరూ సమానం కాదా? ఎస్సీలకు ఒక న్యాయం? అగ్రవర్ణాలకు మరో న్యాయమా?’ అని సూటిగా ప్రశ్నించారు. తన భర్తలాగే కేసులు ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారుల కుటుంబీకులు కూడా కలిసిరావాలని పిలుపునిచ్చారు.
నిజాయితీగల ఆఫీసర్‌గా పేరున్న ఓ అధికారికి భీంరెడ్డి కేసు లేనిపోని తలనొప్పులు తెచ్చిందని సమాచారం. భీమ్‌రెడ్డితో నేరుగా సంబంధం ఉన్న నాయకులంతా.. అతడిని అరెస్టు చేసి, విచారిస్తే తమ పేర్లు కూడా బయటికి వస్తాయని తెలిసి రాజకీయంగా ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఈ క్రమం లో ప్రముఖ మీడియా సంస్థల్లో కూడా భీంరెడ్డి అరెస్టు మినహాయింపుపై కథనాలు రావడంతో ముఖ్యనేత అంతర్మథనంలో పడినట్టు తెలిసింది. పెద్ద మేడమ్ కూడా ఆలోచనలో పడి.. అరెస్టుకు ఓకే చెప్పడంతో ఆగమేఘాలమీద భీమ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇది ప్రభుత్వానికి పేరొచ్చే అంశంలా ఉండటంతో.. అక్రమాస్తుల చిట్టాపై తమ అనుకూల మీడియాకు లీకులిచ్చారు. దీంతో భీంరెడ్డి అరెస్టు, రిమాండ్‌కు వెళ్లిన ఫొటోలు అన్నీ చకచకా బయటికొచ్చాయి. భీంరెడ్డిని అరెస్టు చేయడంతో అప్పటివరకూ ఉన్న ఒత్తిడి మొత్తం మాయ మై.. ఆ ఆనందం మేడమ్ కళ్లలో కనిపించిందని స మాచారం. తన ఇండ్లలో సోదాలకు ముందే భీంరెడ్డి తాను అక్రమంగా సంపాదించిన ఆస్తులను తన సంతానం పేరుమీద బదిలీ చేసి, వారికి ఆ సమాచారం అంతా వాట్సాప్‌లో పంపించి, తాను చార్ధామ్ యాత్రకు వెళ్లినట్టు సమాచారం.
ఎట్టకేలకు డీఎస్పీ భీమ్‌రెడ్డి అరెస్ట్.. న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన ఏసీబీ జ్యుడీషియల్ కస్టడీకి పంపిన కోర్టు
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డిని ఏసీబీ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి సోమవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చా రు. ప్రత్యేక న్యాయస్థానాల న్యాయమూర్తి ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. నాలుగు రోజుల క్రితం భీంరెడ్డి నివాసాలు, కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో సోదాలు చేసి సుమారు రూ.300 కోట్ల ఆస్తులు గుర్తించినట్టు ఏసీబీ వెల్లడించింది. ఈ కేసుపై ఇప్పటికే ఈడీ, ఐటీ సైతం దృష్టిపెట్టినట్టు సమాచారం. ఏసీబీ భీమ్‌రెడ్డిని అరెస్టు చేయడం తో ఈడీ అధికారులు సైతం రంగంలోకి ది గుతారని తెలిసింది. మొదట ఏసీబీ అధికారులు భీంరెడ్డిని తమ కస్టడీకి కోరనున్నారు.