హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పంట, ఆస్తి, ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార నేతృత్వంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులు గురువారం ఢిల్లీలో అమిత్‌షాను కలిసి వినతిపత్రం అందజేశారు. గత ఏడాది ఖమ్మం, పరిసర జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రూ.11,713 కోట్ల సాయం కోరినా ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని గుర్తుచేశారు. వాటితోపాటు తాజా అంచనా రూ. 5,018 కోట్లు కలిపి మొత్తం రూ.16,732 కోట్లను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయ ని, ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వరదలు సంభవించి భారీ విధ్వంసం జరిగిందని తెలిపారు. కేంద్ర బృందాన్ని పంపాలని విజ్ఞప్తిచేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్స్ ప్రోగ్రామ్, దాని అనుబంధ పెట్టుబడులకు ప్రత్యేక ఆర్థిక సాయం ఇవ్వాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఎఫ్ఆర్బీఎం నిధుల విషయంలో మినహాయింపు కోరారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్స్ ప్రోగ్రామ్ గురించి కేంద్రమంత్రికి వివరించారు. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గత ప్రభుత్వం అధిక వడ్డీతో తీసుకున్న రుణాల పరిమితిని సడలించాలని, లోన్ రీస్ట్రక్చరింగ్ చేయాలని, రాష్ట్రంలో పామాయిల్ సాగు ఎకువగా ఉన్నందున పామాయిల్‌పై విధించే సుంకం తగ్గించడంతో రైతులు నష్టపోతున్నారని, సుంకాన్ని పెంచాలని విజ్ఞప్తిచేశారు.