హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల మొత్తం రూ.180.38 కోట్లు విడుదల చేసినట్టు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ని ర్ణయంతో 26,519 మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట కలిగిందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు గత 27 నెలలుగా ఈ బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. ఎంప్లాయీస్ వెల్ఫేర్ క్యాబినెట్ సబ్‌కమిటీ చైర్మన్‌గా ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను ఒకొకటిగా పరిషరిస్తూ వెళ్తున్నట్టు తెలిపారు.