Pub | హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): మీరు కొత్తగా పబ్స్‌కు వెళ్తున్నారా? అయితే.. అక్కడ మీకు ఒంటరిగా తారసపడే అందమైన అమ్మాయిలతో తస్మాత్ జాగ్రత్త. లేకుంటే మీ జేబులు గుల్ల కావడం ఖాయం. పబ్‌లోకి ప్రవేశించగానే మీతో పరిచయం పెంచుకుని చూపులతో కవ్వించడం.. మాయమాటలు, చేష్టలతో మురిపిస్తూ మీకు, తనకు కలిపి భారీగా మద్యం, ఫుడ్ ఆర్డర్ చేయించడం.. అలా బిల్లును అమాంతం పెంచేయడం.. ఆ డబ్బును మీతో కట్టించడమే వారి పని.
ఇదంతా ఆయా పబ్బుల యజమానులు నడిపిస్తున్న తతంగమేనని తెలంగాణ పోలీసులు గురించారు. ఇటీవల హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఈ తరహా మోసాలు పెరిగినట్టు తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. కొత్తవారి మాటల్లో పడి మోసపోవద్దని హెచ్చరించారు.