Bengal Tiger | హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తేతెలంగాణ): ఆడతోడు కోసం బెంగాల్ టైగర్ రెండు నెలలుగా వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో వెతుకుతున్నది. ఇటీవల కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఇద్దరిపై దాడి చేసిన ఈ పులి జాడను అటవీ అధికారులు గుర్తించారు. తాడ్వాయి, వాజేడు, వెంకటాపురం మీదుగా గోదావరి తీరం వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్న పులి అకడి నుంచి తాజాగా ములుగు జిల్లా తాడ్వాయికి వచ్చి నట్టు అటవీశాఖ రేంజ్ అధికారి సత్తయ్య వెల్లడించారు.