KTR | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిగ్బాస్లా కాకుండా బిగ్ బ్రదర్‌లా వ్యవహరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. బిగ్బాస్లాగా చిన్న రాష్ర్టాలను, దక్షిణాది రాష్ర్టాలపై ఆధిపత్యం చెలాయించకూడదని సూచించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆదివారం నిర్వహించిన జర్నలిజం టాక్ షోలో కేటీఆర్ మాట్లాడారు. జర్నలిస్టు మారియాతో సుమారు అర్ధగంటపాటు జరిగిన టాక్ షోలో కేటీఆర్ అనేక అంశాలను ప్రస్తావించారు.
వలస కార్మికులను కేసీఆర్ సొంత బిడ్డల్లా చూసుకున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. 2020-21 కొవిడ్ కాలంలో యూపీ, రాజస్థాన్తోటు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికులకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేసి స్వస్థలాలకు పంపించారని చెప్పారు. దేశంలో ఇలా పంపించిన తొలి ముఖ్యంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు.
హిందీ బెల్ట్ లీడ్ చేసే పరిస్థితి
పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ జనాభా పరంగా కావద్దని కేటీఆర్ అన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు నాడు దక్షిణాది రాష్ర్టాలు జనాభా నియంత్రణ పాటించాయని.. జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ర్టాలు ఇప్పుడు జనాభా పరంగా బాగా ఉన్నాయన్నారు. జనాభా పరంగా పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాది రాష్ర్టాల అజమాయిషి పెరుగుతుందని తెలిపారు. ఇది భారతదేశానికి ఎంతో ప్రమాదకరమని.. దక్షిణాది రాష్ర్టాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దేశాన్ని మొత్తం హిందీ బెల్డ్ లీడ్ చేసే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Population alone cannot be the basis for the redistribution of seats or delimitation.
It will lead to the centralisation of policies and fiscal resources.
The more political parties start feeling that the Hindi belt will decide who becomes the Prime Minister, the entire focus… pic.twitter.com/JG7rsAqaWU
— BRS Party (@BRSparty) July 20, 2025
సమాఖ్య స్ఫూర్తికి మోదీ గండి
‘ బీజేపీకి లాభం ఉంటేనే ఏదైనా పనిచేస్తుంది. పార్టీపరంగా తనకు ఏమి లాభం లేదని ఏమీ చేయదు. కశ్మీర్‌ను రెండు రాష్ర్టాలుగా ఎవరైనా మార్చాలని అడిగారా? ఎందుకు మార్చారు. రాజకీయ ప్రయోజనం కోసం కాదా? మోదీ సర్కారు భారత దేశ సమాఖ్య స్ఫూర్తికి గండికొడుతున్నారు. ప్రధాని మోదీ బిగ్ బ్రదర్‌గా ఉండాలి. బిగ్బాస్లాగా చిన్న రాష్ర్టాలను, దక్షిణాది రాష్ర్టాలపై ఆధిపత్యం చెలాయించకూడదు. 2014-23 వరకు మోదీకి పూర్తిగా ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదు. అంశాలవారీగా మద్దతు ఇచ్చాము. సమాఖ్య దేశంలో రాష్ర్టాలు, దేశం కలిసి వెళ్లాలన్నదే తమ అభిమతం. ఎంఎస్ఎంఈ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టండి. అక్కడ మంచి వనరులు ఉన్నాయి.’ కేటీఆర్ తెలిపారు.
We have always been independent and have never been subservient to anyone.
We extended only issue-based support to the Union government.
We believe that politics should be limited to the last six months, and economics should take centre stage for the remaining four and a half… pic.twitter.com/tSb7JpqWiv
— BRS Party (@BRSparty) July 20, 2025
హిందీ ప్రమోషన్‌కు కోట్ల నిధులు
‘ హిందీని బలవంతంగా దక్షిణాదిపై ఎందుకు రద్దుతున్నారు. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అలాంటి దేశంలో హిందీ భాష అందరూ నేర్చుకోవాల్సిందేనని చెప్పడం తగదు. హిందీ ప్రమోషన్ కోసం కేంద్రం రూ. కోట్లు కేటాయిస్తున్నది. తెలుగు కోసం ఎందుకు నిధులు ఇస్తలేరు? దేశంలో 22 అధికార భాషలు ఉన్నాయి. సంస్కృతి, స్థానిక ఉనికికి ప్రతీకలుగా భాషలు ఉంటాయి. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. రాజ్‌ఠాక్రే కూడా మరాఠీని బలవంతంగా రుద్దవద్దు. తెలుగు, తమిళనాడు.. ఎక్కడా బలవంతంగా రద్దుతున్నారు? దేశానికి రాజ్య భాష ఎందుకు? స్వాతంత్య్రం ఇచ్చి ఇన్నేండ్లయింది. ఇప్పటికీ అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు కొత్త హిందీ అనేది అందరిపై ఎందుకు బలవంతంగా రుద్దాలి?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
BRS Working President @KTRBRS shares his views on ‘Hindi Imposition’, at the ‘Talk Journalism’ event.
“Language is not just a communication tool; it’s a cultural identity.
India has no official language. It has 22 official languages and 300 unofficial languages.
I’m not going… pic.twitter.com/ouCmbGKoCX
— BRS Party (@BRSparty) July 20, 2025