భూపాలపల్లి రూరల్, సెప్టెంబర్ 22: విద్యుత్ లైన్మెన్తోపాటు(Electricity linemen) మరో ముగ్గురిపై తేనె టీగలు(Bees attacked) దాడి చేయడంతో గాయాలైన ఘటన భూపాలపల్లి పట్టణంలో(Bhupalapalli town) చోటు చేసుకుంది. బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం.. పట్టణంలో లైన్మెన్గా విధులు నిర్వర్తి స్తున్న తుల అనిల్ ఆదివారం బాంబులగడ్డ సమీపంలో విద్యుత్ వైర్లను సరిచేస్తున్న క్రమంలో తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.
అతనితోపాటు ఉన్న ముగ్గురిపై కూడా తేనెటీగలు దాడిచేయగా అక్కడే ఉన్న స్థానికులు వీరిని భూపాలపల్లి పట్టణంలోని ఒక ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం దవాఖానలో వారు చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.