NIA | హైదరాబాద్‌లో ఎన్ఐఏ సోదాలు.. ఉగ్రవాదిని వెంటబెట్టుకొని వచ్చి..!
NIA | జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు ఆదివారం హైదరాబాద్‌లో తనిఖీలు చేపట్టారు. సైదాబాద్ శంఖేశ్వర్ బజార్ గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు గంటపాటు సోదాలు నిర్వహించనట్లు తెలుస్తున్నది.
NIA | జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు ఆదివారం హైదరాబాద్‌లో తనిఖీలు చేపట్టారు. సైదాబాద్ శంఖేశ్వర్ బజార్ గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు గంటపాటు సోదాలు నిర్వహించనట్లు తెలుస్తున్నది. ఆగస్టులో ఉగ్రవాది రిజ్వాన్ అబ్దుల్‌ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. అతనికి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా గుర్తించింది. రిజ్వాన్ అబ్దుల్ ఐసిస్ తరఫున పుణే నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడని తేలింది. అతన్ని ఢిల్లీలోని గంగాబక్ష్ మార్గ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ సమయంలో రిజ్వాన్ నుంచి 30 బోర్ పిస్టల్, 3 కాట్రిడ్జ్‌లు, రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రిజ్వాన్‌పై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే రిజ్వాన్ తలపై రూ.3లక్షల రివార్డు ఉన్నది. అరెస్టు అనంతరం ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టింది. రిజ్వాన్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే హైదరాబాద్‌లో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తున్నది. సైదాబాద్ శంఖేశ్వర్ గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్లో రిజ్వాన్ కొద్దినెలలు ఉన్నాడని ఎన్ఐఏ విచారణలో తేలింది. ఈ క్రమంలో అతన్ని తీసుకొని వచ్చి సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- NIA
- NIA search
- Saidabad
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

