Ashwin : సుదీర్ఘ ఫార్మాట్లో మ్యాచ్ విన్నర్‌గా పేరొందిన రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. తనకు అచ్చొచ్చిన చెపాక్ టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటర్లకు మూడు చెరువుల నీళ్లు తాగించాడు. మొదట బ్యాటుతో సెంచరీ కొట్టేసిన అతడు.. ఆ తర్వాత ఆరు వికెట్లతో చెలరేగిన తీరు అమోఘం. సంచలన బౌలింగ్‌తో టీమిండియాను విజయ పథాన నడిపిన అశ్విన్ వ్యక్తిగతంగా మరో ఘనత సాధించాడు.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) 2024-25లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనతో రికార్డు నెలకొల్పాడు. తన పోటీదారుడు అయిన ఆస్ట్రేలియా లెజెండ్ నాథన్ లియాన్(Nathan Lyon)కు అశ్విన్ భారీ షాకిచ్చాడు. సొంతమైదానం అయిన చెపాక్‌లో అశ్విన్ తన తడాఖా చూపించాడు. తొలి రోజు సెంచరీతో జట్టును ఆదుకున్న అశూ భాయ్.. రెండో ఇన్నింగ్స్‌లో 688తో బంగ్లాదేశ్‌ను బెంబేలెత్తించాడు. దాంతో, డబ్ల్యూటీసీ 2024-25 సైకిల్లో 11వసారి అతడు ఐదు వికెట్ల ప్రదర్శనర చేశాడు. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ లియన్ 10 పర్యాయాలు ఈ ఘనత సాధించాడు.
6⃣ wickets in the morning session on Day 4 🙌
Bangladesh 234 all out in the 2nd innings.
A dominating win for #TeamIndia! 💪
Scorecard ▶️ https://t.co/jV4wK7BOKA#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/TR1RoEDyPB
— BCCI (@BCCI) September 22, 2024
టెస్టు చాంపియన్‌షిప్ సైకిల్లో అశ్విన్ అత్యధికసార్లు ఐదు వికెట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. అతడి తర్వాతి స్థానం లియాన్ది కాగా.. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగో స్థానంలో ఉన్నాడు.
1. రవిచంద్రన్ అశ్విన్ (భారత్) – 11 పర్యాయాలు.
2. నాథన్ లియాన్ (ఆస్ట్రేలియా) – 10 పర్యాయలు.
3. ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – 8 పర్యాయాలు.
That’s a FIFER for @ashwinravi99 👏👏
And what a Test match he’s had 🫡
His 37th five-wicket haul in Test cricket.
Live – https://t.co/jV4wK7BgV2…… #INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/nnLlSuI80U
— BCCI (@BCCI) September 22, 2024
4. జస్ప్రీత్ బుమ్రా (భారత్) – 7 పర్యాయాలు.
5. టిమ్ సౌథీ (న్యూజిలాండ్ ) – 6 పర్యాయాలు.
6 . జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 6 పర్యాయాలు.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో హ్యాట్రిక్ ఫైనల్‌పై కన్నేసిన భారత్ ఆ దిశగా దూసుకెళ్లుతోంది. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్(England)ను చిత్తు చేసిన టీమిండియా తాజాగా బంగ్లాదేశ్‌పై భారీ విక్టరీతో అగ్రస్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 27న కాన్పూర్‌లో జరిగే రెండో టెస్టులోనూ విజయంతో సిరీస్ పట్టేయాలని రోహిత్ సేన భావిస్తోంది.