Sathyam Sundaram | కోలీవుడ్ స్టార్ యాక్టర్లు కార్తీ (Karthi), అరవింద్ స్వామి (Aravindha Swamy) లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న చిత్రం మెయ్యళగన్ (Meiyazhagan). 96 ఫేం ప్రేమ్ కుమార్ సీ (Prem Kumar C) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) పేరుతో విడుదల చేస్తుండగా.. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కాగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది కార్తీ టీం.
తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 23న నిర్వహించనున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ షురూ కానుంది. కార్తీ, అరవింద్ స్వామితోపాటు చిత్రయూనిట్ ఈవెంట్లో సందడి చేయనున్నారు. ఈ చిత్రాన్ని హోం బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్పై సూర్య- జ్యోతిక రాజశేఖర్ కర్పూరసుందరపాడ్యన్తో కలిసి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
నిర్మిస్తుండగా.. రాజ్ కిరణ్, శ్రీదివ్య, స్వాతి, దేవదర్శిణి, జయప్రకాశ్, శ్రీరంజిని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి 96 ఫేం గోవింద్ వసంత సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. తమిళంలో సెప్టెంబర్ 27న విడుదలవుతోంది.
Get ready for the Spectacular Pre-Release Event of #SathyamSundaram on September 23rd, 6 PM onwards ✨
📍Park Hyatt, Hyderabad
Book Your Free Passes 👇https://t.co/PK0jtVRhxW pic.twitter.com/eZ3OeyBB27
— BA Raju’s Team (@baraju_SuperHit) September 21, 2024
Adivi Sesh | 2025లో మూడు సినిమాలట.. క్యూరియాసిటీ పెంచేస్తున్న అడివిశేష్
RT75 | ఆర్టీ 75 క్రేజీ న్యూస్.. రవితేజ ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడే..!
Hari Hara Veera Mallu | పవన్ కల్యాణ్‌ను అలా కలిశారో లేదో.. ఇలా హరిహరవీరమల్లు షూట్ షెడ్యూల్