కోడేరు, ఏప్రిల్ 13 : ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివెళ్లేందుకు పార్టీ శ్రేణులు సంసిద్ధులు కావాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నేత దూరెడ్డి రఘువర్ధన్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. దారులన్నీ ఎల్కతుర్తి వైపే సాగాలని సూచించారు. ఇంటి పండుగలా జరిగే సభకు ప్రతి కార్యకర్త తరలిరావాలని కోరారు.