కొల్లాపూర్ రూరల్, జనవరి 9 : అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు అందిస్తామని చెప్పిన హామీని అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డిడి మాండ్ చేశారు. గురువారం నాగర్‌కర్నూల్ జి ల్లా కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పా ర్టీ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి, ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీరం మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రైతుబం ధు కింద కేసీఆర్ ఎకరాకు రూ.10 వేలు అం దిస్తే.. రైతులకు బిచ్చం వేస్తున్నారా.. మేము అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ప్రగల్భాలు పలికి, కొర్రీలు పెడుతూ రూ.12 వేలు అందిస్తామని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. హామీలన్నీ అమలయ్యే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.
కంఠేశ్వర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం నేతలు గురువారం నిజామాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెస్పీ గ్యారంటీ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. మూతబడిన నిజాం షుగర్స్‌ను పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్ సర్కారు.. ఏడాదైనా ప్రారంభించనే లేదని ఎద్దేవా చేశారు. అదే సమయంలో కలెక్టరేట్‌కు వచ్చిన రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని రైతు సంఘం ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు.