హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): వినాయక చవితిని పురస్కరించుకొని గణేశ్ విగ్రహాల తరలింపు లో, మండపాల ఏర్పాట్లలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆదివారం ప్రకటనలో హెచ్చరికలు జారీచేసింది. ట్రాఫిక్ అధికంగా ఉండే వేళల్లో విగ్రహాల తరలింపుల్లో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నది.
నిపుణులైన డ్రైవర్లనే విగ్రహాల తరలింపు వాహనాలకు ఎం చుకోవాలని సూచించింది. చిన్నారులను విగ్రహాల తరలింపుల్లో భాగస్వాములను చేయొద్దని హెచ్చరించింది. విగ్రహం ఎత్తును బట్టి ముందుగానే రూట్‌ను ఎంచుకోవాలని పేర్కొన్నది.