హైదరాబాద్, మే16 (నమస్తే తెలంగాణ): జనాభా దదామాషా ప్రకారం నిధులు, రిజర్వేషన్లలో బీసీల వాటా బీసీలకు ఇవ్వాలని, లేదంటే రాబోయే రోజుల్లో దేశంలో తిరుగుబాటు తప్పదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ భవన్లో 16 బీసీ సంఘాల ప్రతినిధులతో గురువారం ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు.
బీసీల అనుకూల వైఖరి అవలంబించి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు, ప్రత్యేక మంత్రిత్వశాఖ, ఏటా 2లక్షల కోట్ల బడ్జెట్ బీసీల అభివృద్ధికి కేటాయిస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, ఓయూ జేఏసీ నేత ఏనుగంటి రాజునేత, తదితరులు పాల్గొన్నారు.