కాచిగూడ, జనవరి 26 : మున్సిపల్ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు 56 శాతం టికెట్లు కేటాయించాలని, లేకుంటే రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనను అడ్డుకుంటామని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. బీసీ జేఏసీ కోచైర్మన్ ఉప్పరి శేఖర్, వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం కాచిగూడలోని ఓ హోటల్లో బీసీ కులసంఘా ల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. బీసీలకు రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీకి దిక్కు లేకుండా పోయింద ని ఆరోపించారు. బీసీలు గడ్డివాములాంటి వారని, అగ్గిపుల్ల వేస్తే భగ్గుమంటారని పేర్కొన్నారు. బీసీలకు 68 మున్సిపల్ చైర్మన్లు, 1,150 కౌన్సిలర్ పదవులు ఇవ్వాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకు లు కుల్కచర్ల శ్రీనివాస్‌ముదిరాజ్, విక్రమ్‌గౌడ్, శ్యామ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.