ఖైరతాబాద్, ఆగస్టు 1 : సమగ్ర కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శా తం రిజర్వేషన్ల అమలులో సర్కారు నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద బీసీ సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్టు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్ తెలిపారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమగ్ర కులగణన చేపడుతామని, స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో హామీ ఇచ్చి విస్మరించిందని ఆరోపించారు.
ఓ వైపు సామాజిక న్యాయం, రిజర్వేషన్లపై ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ మాట్లాడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం వాటిని తుంగలో తొక్కి రిజర్వేషన్లు అమలు చేయకుండానే స్థాని క ఎన్నికలు నిర్వహించాలనే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.