హైదరాబాద్, అక్టోబర్18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్న కులగణనకు బీజేపీ మద్దతివ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ నేతలు శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన చేపడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చి పక్రియను ప్రారంభించిందని తెలిపారు. 20న నిర్వహించబోయే అఖిలపక్ష సమావేశంలో పాల్గొనాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, అక్టోబర్18 (నమస్తే తెలంగాణ) : బీసీ, ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని పలు లా కాలేజీల్లో సీట్ల భర్తీకి శనివారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఆయా సొసైటీల కార్యదర్శులు సైదులు, వర్షిణి ప్రకటన విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం బాలుర లా కాలేజీలో 47 సీట్లు, హనుమకొండ జిల్లా కాజీపేట బీసీ గురుకుల వుమెన్ లా కాలేజీలో 39సీట్లు, సరూర్‌నగర్ లా కాలేజీలో 29సీట్లు అందుబాటులో ఉన్నట్టు వెల్లడించారు. లాసెట్-2024లో అర్హత సాధించిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా ఆయా కళాశాలల్లో నేడు నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావాలని వెల్లడించారు. వివరాలకు 93966 00601, 99083 44469 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.