హైదరాబాద్, జనవరి6 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలుగా అవకాశం దకని బీసీ నేతలకే ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ ఒక ప్రకటనలో కాంగ్రెస్ పార్టీని కోరారు. లేదంటే రాజకీయంగా ఆ పార్టీకి పతనం తప్పదని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ పదవులకు త్వరలో జరగనున్న ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ బీసీలకే ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ఎందరో బీసీ నేతలు తమ అవకాశాలను త్యాగం చేశారని గుర్తు చేశారు.