BC Reservations | హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టు వద్ద బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ కోర్టు వద్ద బీసీ సంఘాలు నేతలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్లే బీసీలకు అన్యాయం జరిగింది అని బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. బీసీలకు పదవులు వస్తుంటే అగ్రకులస్తులు ఓర్వలేకపోతున్నారు అని వారు మండిపడ్డారు. బీసీల నోటి కాడ ముద్దను లాక్కున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రి పదవులు మొత్తం అగ్రవర్ణాలకే. కనీసం ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ పదవులైనా బీసీలకు దక్కొద్దా..? అని ప్రభుత్వాన్ని బీసీ నేతలు నిలదీశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. జీవో అమలును నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలుకు పిటిషనర్లకు 2 వారాల గడువు విధించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు కోర్టు వాయిదా వేసింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైనా స్టే విధించి షాక్ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై రెండు రోజుల పాటు హైకోర్టులో సుధీర్ఘ విచారణ కొనసాగిన సంగతి తెలిసిందే.
సీఎం డౌన్ డౌన్ అంటూ తెలంగాణ హైకోర్టు వద్ద బీసీ సంఘాలు నిరసన https://t.co/3vmNAJnB4M pic.twitter.com/k9Jv9PB6cH
— Telugu Scribe (@TeluguScribe) October 9, 2025