రవీంద్రభారతి: తక్షణమే కులగణన షె డ్యూల్ విధివిధానాలను ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, లేకుంటే కాంగ్రెస్‌కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శనివా రం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కులగణనపై హైకోర్టు మూడు నెలల గడువు విధించినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించడం లేదని ధ్వజమెత్తారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి కులగణనను విస్మరించడం సహించరానిదని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై 16 నుంచి 19 వరకు అన్ని జిల్లాలో అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, ఎంపీ ఈటల రాజేంద ర్, మాజీ ఎంపీ హనుమంతరావు, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, గొరిగె మల్లేశ్, అంజీ, భూపేశ్‌సాగర్, లక్షణ్యాదవ్ పాల్గొన్నారు.