ఖైరతాబాద్, ఫిబ్రవరి 13: రాష్ట్రంలోని బీసీ సమాజం జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి రాజ్యాధికారం సాధించుకుందామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు.
గురువారం లక్డికాపూల్‌లోని హోటల్ అశోకలో బీసీ మేధావుల ఫోరం, బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జూజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కులగణన రీసర్వేకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం మాట్లాడుతూ.. రీసర్వేలో భాగంగా ఆన్లైన్, టోల్‌ఫ్రీ సౌకర్యాలతోపాటు ప్రతి ఇంటికి వెళ్లి నమోదు కాని వివరాలు సేకరించాలని సూచించారు.