హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తేతెలంగాణ): బడుగు బలహీనవర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు గురువారం టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల కోసం హైదరాబాద్‌లో స్థలం, నిర్మాణాలకు నిధులు ఇచ్చినట్టు గుర్తుచేశారు. సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టడం చాలా అభినందనీయమంటూ.. మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ ప్రతిపాదనకు మంత్రి కేటీఆర్ అంగీకరించారు.