హైదరాబాద్, నవంబర్27 (నమస్తే తెలంగాణ) : గ్రామాభివృద్ధి కమిటీల పేరిట బీసీలను సామాజిక బహిష్కరణకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ లేఖ రాశారు. గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో బీసీ వర్గాలను సామాజిక బహిషరణకు గురిచేస్తున్న ఉదంతాలు తమదృష్టికి వచ్చాయని వివరించారు.
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): కార్తీకమాసం వనభోజనాల పేరిట టీజీఎస్ఆర్టీసీ మేనేజ్మెంట్ భారీ దోపిడీకి తెరతీసిందని ఆర్టీసీ జేఏసీ ఆగ్రహం చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ అశ్వత్థ్థామరెడ్డి, కన్వీనర్ నరేందర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కార్మికులు ఎవరూ కోరుకోనప్పటికీ వన భోజనాల పేరిట రూ.1.20కోట్ల దోపిడీకి మేనేజ్మెంట్ ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని, విచారణ జరిపి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.