హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఆరోగ్యశాఖలోని బస్తీదవాఖానల్లో పనిచేసే కాంట్రాక్టు డాక్టర్లు, స్టాఫ్ నర్సు లు, సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలిపారు. 500 మంది వరకు కాం ట్రాక్టు పద్ధతిలో బస్తీ దవాఖానాల్లో విధులు నిర్వహిస్తున్నారు. పెండింగ్ వేతనాల విషయ మై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను కలవగా.. సెంట్రల్ నుంచి ఫండ్ రాలేదు, వచ్చినప్పుడు తీసుకోండంటూ దురుసుగా మాట్లాడుతున్నారని కాంట్రాక్టు ఉద్యోగులు వాపోయారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని చెబితే బయట ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోండంటూ ఓ మహిళా ఉన్నతాధికారి ఉచిత సలహా ఇచ్చారని తెలిపారు. పీహెచ్‌సీల్లోని కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లకు సైతం ఆరు నెలలుగా జీతం పెండింగ్‌లో ఉందని, త్వరగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్యులకు జీతాలు ఇవ్వని పరిస్థితిని తామేన్నడు చూడలేదని వారు తెలిపారు.
‘టీవీవీపీ’ ఉద్యోగులకు జీతాలు విడుదల
టీవీవీపీ పరిధిలో పనిచేసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నాలుగు నెలల జీతాలను ప్రభుత్వం విడుదల చేసింది. కాగా ఆగస్టు, సెప్టెంబర్ జీతాలను చెల్లించకపోవడం గమనార్హం. మరో వైపు 104 సిబ్బందికి ఐదు నెలలుగా జీతాలను విడుదల చేయకపోవడంతో వారంతా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.