Vikarabad | వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిధిలోని బషీరాబాద్‌లో షాద్‌నగర్ తరహా ఉదంతం చోటు చేసుకుంది. విచారణ పేరుతో దళిత మహిళకు బషీరాబాద్ ఎస్ఐ రమేశ్ కుమార్ చిత్రహింసలు పెడుతున్నాడు. కుమారుడి ఆచూకీ చెప్పకపోతే తుపాకీతో కాల్చి చంపేస్తా అంటూ దళిత మహిళను ఎస్ఐ బెదిరింపులకు గురి చేస్తున్నాడు.
ప్రేమించిన అమ్మాయితో కొడుకు వెళ్లిపోగా, అతని తల్లి కళావతిని మూడు నెలలుగా ఎస్ఐ రమేశ్ కుమార్ చిత్రహింసలు పెడుతున్నాడు. విచారణ పేరిట పోలీస్ స్టేషన్‌కు పిలిచి కాళ్లు, చేతులు వాచేలా ఎస్ఐ రమేశ్ కుమార్ లాఠీతో కొట్టారని దళిత మహిళ కళావతి ఆరోపించింది. ఈ క్రమంలో ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల ఆందోళనకు దిగాయి.
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గా గ్రామానికి చెందిన లోహడ నరేష్(17), కాశీంపూర్ గ్రామానికి చెందిన బాలిక(16) ప్రేమించుకొని 3 నెలల క్రితం ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. అయితే బాలికను నరేష్ కిడ్నాప్ చేశాడని బాలిక కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నరేష్ తల్లిని బషీరాబాద్ స్టేషన్‌కు పిలిచి కొడుకు అడ్రస్ చెప్పాలని కాళ్లు, చేతులు వాచిపోయేలా లాఠీ దెబ్బలు కొట్టారు. నరేష్ దొరికే వరకు అతని తల్లి కళావతి రోజు పోలీస్ స్టేషన్‌కు రావాలని చెప్పడం, పోలీస్ స్టేషన్‌కు వచ్చాక ఆమెను కొట్టడం, బయట కూర్చోబెట్టడం చేస్తున్నారు.
విచారణ పేరుతో దళిత మహిళకు బషీరాబాద్ ఎస్ఐ రమేశ్ కుమార్ చిత్రహింసలు
కొడుకు ఆచూకీ చెప్పకపోతే తుపాకీతో కాల్చి చంపేస్తా అంటూ ఎస్ఐ బెదిరింపులు
ప్రేమించిన అమ్మాయితో కొడుకు వెళ్లిపోగా, అతని తల్లి దళిత మహిళ కళావతిని మూడు నెలలుగా చిత్రహింసలు పెట్టిన బషీరాబాద్ ఎస్ఐ
విచారణకు పోలీస్… https://t.co/AUfVtgOxha pic.twitter.com/Q4sVu5UFfO
— Telugu Scribe (@TeluguScribe) August 16, 2024
ఇవి కూడా చదవండి..
Shadnagar Incident | దళిత మహిళపై థర్డ్ డిగ్రీ.. షాద్‌నగర్ డీఐ సహా నలుగురు కానిస్టేబుళ్లపై కేసు
Special Trains | వరుస సెలవులు.. సికింద్రాబాద్, కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లు
Nagarjuna Sagar | నిండుకుండలా నాగార్జున సాగర్.. 4 క్రస్ట్ గేట్లు ఎత్తివేత