Nagarjuna Sagar | నల్లగొండ : నాగార్జున సాగర్ జలాశయానికి వరద పెరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. ఎగువ కురిసిన వర్షాలకు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు వరద రాగా.. డ్యామ్ జలకళను సంతరించుకున్నది. ఇప్పటికే జలాశయం నిండకుండను తలపిస్తున్నది. దీంతో సాగర్‌లోని 4 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 79,528 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ ప్రస్తుత, పూర్తి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 312 టీఎంసీలు.
నాలుగు రోజుల కిందటి వరకు వరద ప్రవాహం రావడంతో 24 గేట్లు.. ఆ తర్వాత 18 గేట్లను ఎత్తి నీటి దిగువకు వదిలారు. రెండు రోజుల క్రితం వరద రావడంతో బుధవారం రెండు గేట్లను ఎత్తగా.. గురువారం వరద మరింత పెరిగింది. దాంతో ఆరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. వరద మరింత పెరగడంతో ఇవాళ నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో సాగర్‌కు క్యూ కట్టారు. వరుసగా సెలవులు రావడంతో సాగర్ వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉన్నది.
ఇవి కూడా చదవండి..
KTR | ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం.. ఇస్రో బృందానికి కేటీఆర్ శుభాకాంక్షలు..
Professor Kodandaram | ఎమ్మెల్సీలుగా ప్రమానం చేసిన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్
Boycott | విధులు బహిష్కరించిన డాక్టర్లు.. ప్రభుత్వ దవాఖానల్లో నిలిచిన ఓపీ సేవలు