KTR | హైదరాబాద్ : ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఇస్రో బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ వాహన నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. మొత్తం 17 నిమిషాల పాటు ఈ ప్రయోగం సాగింది. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్ని పర్వతాలపై ఇది పర్యవేక్షించనుంది.
ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో ఈవోఎస్ను అభివృద్ధి చేశారు. ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్(ఈవోఐఆర్) పేలోడ్ మిడ్ -వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రా-రెడ్లో చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది.
Many congratulations to Team ISRO 🙏 https://t.co/X1fWeMWHfP
— KTR (@KTRBRS) August 16, 2024
ఇవి కూడా చదవండి..
Boycott | విధులు బహిష్కరించిన డాక్టర్లు.. ప్రభుత్వ దవాఖానల్లో నిలిచిన ఓపీ సేవలు