బాన్సువాడ, అక్టోబర్ 25 : బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాల జోరు కొనసాగుతున్నది. తాజాగా కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని బైరాపూర్ గ్రామస్థులు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతు ప్రకటించారు. ముదిరాజ్ సంఘానికి చెందిన 120 మంది, యాదవ సంఘానికి చెందిన 70, కురుమ సంఘానికి చెందిన 25 మంది, గౌడ కులస్థులు 25 మంది, వడ్డెర కులస్థులు 25 మంది, ముస్లింలు 25 మంది, నాయీ బ్రాహ్మణులు 25 మంది, కుమ్మరి, కమ్మరి, చాకలి కుటుంబాల వారు స్పీకర్ వెంటే ఉంటామంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.
ఈ పదేండ్లలో పోచారం శ్రీనివాసరెడ్డి బైరాపూర్ గ్రామ అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో స్పీకర్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చేసిన తీర్మాన ప్రతిని బుధవారం పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి అందజేశారు.