‘బండి’ ధర్నా రాజకీయ డ్రామా
ఇందిరాపార్క్ వద్ద కాదని, దమ్ముంటే మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని బండి సంజయ్‌కు రెడ్కో చైర్మ న్ సతీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. నిరుద్యోగ మహాధర్నా పేరుతో శనివారం చేపట్టే ధర్నాను రాజకీయ డ్రామా గా అభివర్ణించారు. యువత దృష్టి మరల్చి, లబ్ధి పొం దాలనే నీచపు ఆలోచన తప్పా, యువతపై ప్రేమ లేదని ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు.
- దమ్ముంటే ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చెయ్
- రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి సవాల్
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఇందిరాపార్క్ వద్ద కాదని, దమ్ముంటే మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని బండి సంజయ్‌కు రెడ్కో చైర్మ న్ సతీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. నిరుద్యోగ మహాధర్నా పేరుతో శనివారం చేపట్టే ధర్నాను రాజకీయ డ్రామా గా అభివర్ణించారు. యువత దృష్టి మరల్చి, లబ్ధి పొం దాలనే నీచపు ఆలోచన తప్పా, యువతపై ప్రేమ లేదని ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగా ల నోటిఫికేషన్లు ఇస్తే, అది బీజేపీకి యువతను దూరం చేసే కుట్ర అన్న బండి, ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తున్నారని ప్ర శ్నించారు.
యువత, ఉద్యోగులు చదువు లు, ఉద్యోగాలు పకన పెట్టి బీజేపీ కోసం రాజకీయం చేయాలని, రోడ్లెకాలని పి లుపునిచ్చి వారి జీవితాలతో చెలగాటం ఆడుకోవాలని చూసిన బండికి యువత గురించి మాట్లాడే నైతిక హక్కులేదని తేల్చిచెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం యువతకు చేసిన మంచిపనేమిటి? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

