హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సచివాలయంలో కూల్చివేతలు ఉంటాయని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ బేగంపేటలో మీడియాతో మాట్లాడారు.
బీజేపీ అధికారంలోకి వస్తే సచివాలయంలో డోమ్‌లను కూల్చేస్తామని గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. వరదలకు సంబంధించి నిబంధనల ప్రకారం సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని చెప్పారు.