Bandi Sanjay | రేవంత్ రెడ్డి సర్కారుకు కళ్లు లేవా.. బండి సంజయ్ ఆగ్రహం
Bandi Sanjay | చెరువు పరిధిలోనే ఉన్నప్పటికీ ఒవైసీ కాలేజీ చెరువులో లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా మాట్లాడుతోందని, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. నిరుపేదల ఇళ్లను కూల్చడానికి ఉన్న ఉత్సాహం.. అందరికీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్న ఈ భారీ ఆక్రమణల కూల్చవేతలపై ఎందుకు లేదని నిలదీశారు.
Bandi Sanjay : చెరువు పరిధిలోనే ఉన్నప్పటికీ ఒవైసీ కాలేజీ చెరువులో లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా మాట్లాడుతోందని, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. నిరుపేదల ఇళ్లను కూల్చడానికి ఉన్న ఉత్సాహం.. అందరికీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్న ఈ భారీ ఆక్రమణల కూల్చవేతలపై ఎందుకు లేదని నిలదీశారు. రేవంత్ రెడ్డి సర్కార్‌కు నిజంగానే కంటిచూపు సమస్య ఉందా..? లేక ఎంఐఎంతో ఉన్న రాజకీయ బంధం వల్ల ఆ సంకల్పం లోపించిందా..? అంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నాయకుల కంటి జబ్బును నయం చేసేందుకు బీజేపీ కార్యకర్తలంతా కలిసి ఉచిత నేత్ర పరీక్ష శిబిరాలు నిర్వహించాలని బండి సంజయ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కళ్లు పరీక్షించాక కూడా అక్కడ చెరువు ఆక్రమణ కనిపించకపోతే, అది కంటి లోపం కాదని, కచ్చితంగా రాజకీయ లోపమేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ అవసరాలకు, ఓటు బ్యాంకు రాజకీయాలకు అనుగుణంగా ఎఫ్టీఎల్ పరిధి గీతలను ఇష్టమొచ్చినట్లు మారుస్తోందనే అనుమానాలు ఇప్పుడు ప్రజల్లో బలంగా వ్యక్తమవుతున్నాయన్నారు.
చట్టం ముందు అందరూ సమానమేనని కాగితాల మీద చెప్పే ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం పేదలకు ఒక న్యాయం, అధికార పక్షానికి దగ్గరగా ఉండే ఎంఐఎం లీడర్లకు మరో న్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. నచ్చిన వారిని వదిలేసి, నచ్చని వారిపై ఎంపిక చేసుకుని మరీ దాడులు చేయడం సరికాదని హితవు పలికారు. చెరువుల సంరక్షణ విషయంలో ప్రభుత్వం ఈ ద్వంద్వ వైఖరిని పక్కనబెట్టాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

