సిద్దిపేట : నన్ను అనవసరంగా గెలుకుతున్నారు. నేను శాంతియుతంగా ప్రజాహిత యాత్ర చేపడితే మీకేం వచ్చింది. ఎక్కడ నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. హుస్నాబాద్ మండలం రాములపల్లి నుంచి బండి సంజయ్ ప్రజాహిత యాత్ర పోలీసుల భారీ బందోబస్తు మధ్య కొనసాగుతున్నది.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పై( Ponnam Prabhakar) ఎంపీ బండి సంజయ్ పై మండిపడ్డారు. ఏదో అలజడి సృష్టించి యాత్రను అడ్డుకోవాలంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీ అభ్యర్థి ఎవరో నిలబెట్టండి గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. లేకుంటే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు.