హైదరాబాద్ : రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలకు(Gurukula Vidyalayas) రూపొందించిన కొత్త టైం టేబుల్(Gurukula Vidyalayas) పనివేళలను కుదించాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) బహిరంగ లేఖ రాశారు. ఉదయం 5 నుంచి రాత్రి 9.30 గంటల వరకు పనివేళలు రూపొందించడంవల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని బండి సంజయ్ తెలిపారు. అలాగే రాత్రిపూట స్టడీ అవర్, కేర్ టేకర్ విధులను కూడా టీచర్లకు అప్పగించడం సరైంది కాదన్నారు.
వార్డెన్ పోస్టులు మంజూరైనా భర్తీ చేయకపోవడం బాధాకమని, తక్షణమే వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా పోలీసులకు నెలల తరబడి టీఏ, డీఏ, పీఆర్సీ, సరెండర్ లీవ్ బిల్స్ చెల్లించకపోవడం దారుణమని విమర్శించారు. వివిధ విభాగాల్లోని దాదాపు వెయ్యి మంది పోలీసులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బకాయిలను చెల్లించిన ప్రభుత్వం కరీంనగర్ జిల్లా పోలీసులను పట్టించుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తక్షణమే టీఏ, డీఏ, పీఆర్సీ బకాయిలతోపాటు సరెండ్ లీవ్ బిల్స్ చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు.