రాజన్న సిరిసిల్ల : రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఆరు గ్యారంటీలపై సమాధానం చెప్పే దమ్ముందా? అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి కులగణన సంప్రదింపుల సమావేశానికి రాహుల్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగిలో మీడియాతో మాట్లాడారు. ఏం సాధించాని మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ యాడ్స్ ఇస్తుందన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత అల్లుడి కోసమే మూసీ పునరుజ్జీవం చేపడుతున్నారని విమర్శించారు. రూ.15 వేల కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. శంషాబాద్‌లో ఆంజనేయస్వామి ఆలయంపై దాడి అమానుషమన్నారు. తక్షణమే దుండుగలను అరెస్ట్ చేయాలన్నారు.
ఇవి కూడా చదవండి..
KCR | దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి.. నివాళులర్పించిన కేసీఆర్
Harish Rao | 11 నెలల కాంగ్రెస్ పాలనలో 36 మంది రెసిడెన్షియల్ విద్యార్థులు మృతి : హరీశ్‌రావు
Inter Exam Fee | ఇంటర్ ఎగ్జామ్ ఫీజు తేదీలు వచ్చేశాయ్..