జలసౌధలో మీడియాపై నిషేధం
మాది ప్రజాపాలన అని నిత్యం ఊదరగొడుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ పనితీరు, వైఫల్యాలను ఎత్తిచూపినందుకు ఆంక్షల కత్తితో అడ్డుకుంటున్నది.
- ఇదీ ప్రజాపాలన ప్రభుత్వం తీరు
- సర్కార్‌పై పాత్రికేయులపై ఆగ్రహం
హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): మాది ప్రజాపాలన అని నిత్యం ఊదరగొడుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ పనితీరు, వైఫల్యాలను ఎత్తిచూపినందుకు ఆంక్షల కత్తితో అడ్డుకుంటున్నది. ఇరిగేషన్‌శాఖలో ఇటీవల సీనియర్లను పక్కనపెడుతూ జూనియర్లు, ఏపీ స్థానికత కలిగిన అధికారులకే కీలకస్థానాలను ప్రభుత్వం కట్టబెడుతున్నది. దీంతో ప్రభుత్వ అసమర్థత, వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ఇంజినీర్లను పక్కకు తప్పిస్తుండటంతోపాటు, తెలంగాణ ఇంజినీర్లపై ఎక్కడికక్కడ నిఘాను పెట్టింది. ఇరిగేషన్‌పై మీడియాకు సమాచారం ఎవరిస్తున్నారు? లేఖలు, ప్రభుత్వపర అంశాలు ఎవరు లీకు చేస్తున్నారు? అంటూ కొంద రు ఇంజినీర్లపై కక్షసాధింపు చర్యలకు పూనుకున్నది. దీంతో ఆయా అంశాలపై ఇరిగేషన్లో ‘తెలంగాణ’పై ఆంక్షల పేరి ట ‘నమస్తే తెలంగాణ’ ఇటీవల ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఆ తప్పులను సరిదిద్దుకోపోగా, ప్రజాపాలన అని చెబుతున్న రేవంత్ సర్కార్.. ఇంజినీర్లపైనే కాదు ఏకంగా జలసౌధ భవన సముదాయాన్నే కట్టుదిట్టం చేసింది. నిరుడు ఎ న్నడూ లేనివిధంగా భవనంలోకి మీడి యా ప్రతినిధులు, ఇతరుల ప్రవేశాన్ని నిషేధించింది. గుర్తింపు కార్డు ఉంటేనే జలసౌధలోకి అనుమతించాలని ఈఎన్సీని ఆదేశించింది. ఏ ఫ్లోర్లో, ఏ అధికారి వద్దకు వెళ్తున్నామో చెప్పిన తర్వాతే, సదరు అధికారి అనుమతిస్తేనే భవనంలోకి అనుమతించాలని అధికారులకు హుకుం జారీచేసింది. దీనివెనుక కేంద్రంలోని బీజేపీకి అత్యంత సన్నిహితుడిగా ఒకాయనే కారణమని తెలుస్తున్నది. విలేకరులు జలసౌధలో తిరుగుతూ ప్రతి తప్పిదాన్ని వెలుగులోకి తెస్తున్నారని, వారిని అనుమతించకూదని, విజిటర్స్ ఎవరు వచ్చినా పేరు నమోదు చేయడం తప్పనిసరి అని సదరు నేత ఆదేశించాడని తెలిపింది. ఆయన ఆదేశాలే తరువాయి కాంగ్రెస్ సర్కార్ ఆచరణలోకి తెచ్చిందని జలసౌధలో చర్చించుకుంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

