హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): లగచర్ల ఘటనలో రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌తోపాటు, బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్లను దిగువ కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని వికారాబాద్ జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశిస్తూ జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కింది కోర్టు జారీచేసే ఉత్తర్వులపై ప్రభావం చూపబోవని, మెరిట్స్ ఆధారంగా తీర్పు వెలువరించాలని దిగువ కోర్టుకు సూచించారు.
కొండా సురేఖపై పరువు నష్టం కేసు 13కు వాయిదా
నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్ కేసు విచారణ ఈ నెల 13కు వాయిదా వేసింది. ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి శ్రీదేవి సెలవుపై ఉండడంతో కేసు విచారణ వాయిదా పడింది.