రఘునాథపాలెం, సెప్టెంబర్ 7: మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లో చేపలను వదులుతున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. చెరువుల్లోని చేపలతో ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలని సూచించారు.
బుధవారం రఘునాథపాలెం మండలం కోటపాడు చెరువులో 80 వేల చేప పిల్లలను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి మంత్రి వదిలారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ.. మిషన్ కాకతీయతో రాష్ట్రంలోని చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయన్నారు.